హైవేలపై ఫాస్టాగ్ : డిసెంబర్ 1 నుంచి తప్పని సరి

హైదరాబాద్,: ఈ వాహనాని ఫాస్టాగ్ ఉందా..? వెంటనే ట్యాగ్ రిజిస్టర్ చేయించుకోండి. లేదంటే హైవేలపై డబుల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ విధానం అమల్లోకి వస్తోంది. ప్రత్యేకించి జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల మీదుగా వాహనాలకు ఈ ఫాస్టాగ్ విధానం వర్తిస్తుంది. ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఈ ట్యాగ్ ఉండాల్సిందే. లేదంటే.. చెల్లించాల్సి టోల్ ఫీజు కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వం వాహనదారుల సౌకర్యార్థం డిసెంబర్ 1 వరకు ప్రభుత్వ హైవే కౌంటర్లలో ఫాస్టాగ్ లను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ 1 తర్వాత వాహనానికి ఫాస్టాగ్ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.100 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. 2.5శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఫాస్టాగ్ వల్ల పలు ప్రయోజనాలున్నాయి. జాతీయ రహదారి టోల్ ప్లాజాల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ తో పాటు ఇతర చెల్లింపులు అంగీకరించాలని నేషనల్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఎ) నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 వరకు ప్రభుత్వం హైవే కౌంటర్లలో ఫాస్టార్లను ఉచితంగా ఇస్తుంది. సొంతంగా రీ ఛార్జి చేసుకోవాలి. బ్యాంకుల నుంచి లేదా అమెజాన్, ఆన్లైన్లో ఫాస్టాగ్స్ తీసుకోవచ్చు. రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఎల్ హెచ్ఎంసీఎల్ ఎన్‌ హెచ్ఐఐలు ఏర్పాటు చేసిన 28వేల500 పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా విక్రయిస్తారు. ఆర్టీవో, కామన్ సర్వీసు సెంటర్లు, ట్రాన్స్ పోర్టు హబ్స్, బ్యాంకు బ్రాంచీలు, ఎంచుకున్న పెట్రోల్ బంకులున్నాయి. ఫాస్టాగ్ అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, పేటీఎం, 12వేల శాఖలలో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఫాస్టాగ్ కోసం వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), వాహన యాజమాని పాస్ పోర్టు, పాన్ పోర్టు సైజు ఫొటోలు, వాహనం యొక్క కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. వాహనానికి సంబంధించిన వివరాల కోసం ఫాస్టాగ్ మొబైల్ యాప్ ద్వారా చూసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ట్యాగ్ లేకుండా.. ఏదైనా వాహనం వస్తే టోల్ గేట్ల దగ్గర రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. ఫాస్టాగ్ పోర్టల్ లాగిన్ కావాలి. టాప్ అప్ ఆఫ్ఫన్ ఉంటుంది. వాలెట్ ఐడీని ఎంచుకోని రీఛార్జ్ చేయాలి. ఒకవేళ వాహన హోల్డర్ అయితే.. ఫాస్ట్ ట్యాగ్ ప్రీపెయిడ్ ఖాతాలో ఒకేసారి 10 వేలు కంటే ఎక్కువ జమ చేయడానికి అనుమతి ఉండదు. పూర్తి కేవైసీ ఉన్న వారికి మాత్రం లక్ష వరకు జమ చేయవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు.