శ్రీశైలం-సాగర్ లో లాంచి ప్రయాణాలు రద్దు

న్యూస్ శ్రీశైలం : సరదాగా సెలవుల్లో బోటు షికారుకు వెళ్లామనుకునే పర్యాటకులకు ఇది చేదు వార్త. గత నెలలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం ఎలాంటి పడవ ప్రయాణాలు ఉండవని, అన్ని లాంచి రూట్లను ! మూసివేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో సెలవులను ఆస్వాదించాలనుకునే పర్యటకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు అనధికారికంగా సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రజలు కూడా బోటు ప్రయాణాల పట్ల జంకుతున్నట్టు చర్చ జరుగుతోంది. 2017లో కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడటం, ఆ తర్వాత గోదావరిలో పడవ బోల్తా పడడంతో పర్యాటకులు చాలా వరకు భయపడుతున్నట్టు తెలుస్తోంది. బోటు ప్రమాదాలు పర్యాటక శాఖకు గండికొడుతున్నాయి. ప్రజలు కూడా బోటు ప్రయాణాల పట్ల తీవ్రంగా బయువ డి పోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గోదావరి కచ్చులూరు బోటు ప్రమాద ఘటన నేపథ్యంలో నాగార్జునసాగర్- శ్రీశైలం వరకు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న లాంచీ ప్రయాణాన్ని రద్దు చేసినట్లు లాంచీ స్టేషన్ మేనేజర్ హరి బాబు తెలిపారు. అయితే, పర్యాటకుల భద్రత దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే రెండు నెలలుగా లాంచీలు అంతగా నడవలేదని తెలుస్తోంది. మూడు రోజుల నుంచి జలాశయంలో లాంచీలు, జాలీ ట్రిప్పులు నడుపుతున్నారు. దీంతో 23 నుంచి సాగర్శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. కాగా, ట్రిప్పుకు సరిపడా పర్యాటకులు రిజర్వేషన్ చేసుకోకపోవడంతో సాగర్-శ్రీశైలం ట్రిప్పును రద్దు చేసినట్లు మేనేజర్ హరిబాబు తెలిపారు. ఆర్ధికంగా పర్యాటక రంగానికి ఇలాంటి పరిణామాలు శరాఘాతంగా మారుతున్నాయని ఆయన తెలిపారు.